
వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
డీఎల్‌పీఓ సతీష్‌రెడ్డి
మొయినాబాద్‌రూరల్: భారీ వర్షాలు కురు స్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని డీఎల్‌పీఓ సతీష్‌రెడ్డి సూచించారు. గురు వారం మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ పంచాయతీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శి కవితను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగారు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రమాదాలు ఉన్న చోట ప్రజలను వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు. పర్యటనలో పంచాయతీ కార్యదర్శి కవిత, కారోబార్ గోపాల్‌చారి పాల్గొన్నారు.