
కాశన్నకుంట.. వెంచర్లే వెంట
కొత్తూరు: రియల్‌భూమ్ జోరుగా సాగిన సమయంలో మండలంలోని పలు చెరువులు, శిఖం భూముల్లో సైతం వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. నిబంధనలు పాటించకుండా ఎఫ్‌టీఎల్ లెవల్‌లో రోడ్లు, స్తంభాలు పాతి మరీ వ్యాపారులు బహిరంగంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కొత్తూరు మండలకేంద్రం ఎస్సీ కాలనీ సమీపంలో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాశన్నకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో రియల్‌వెంచర్ ఏర్పాటు చేశారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం చాలా వరకు తగ్గింది. వర్షాకాలంలో చెరువులో నీరు పూర్తిస్థాయిలో నిండినప్పుడు వెంచర్ రోడ్లు, రాళ్లు కనిపించవు. స్తంభాలు మాత్రం పైకి కనిపిస్తున్నాయి.