
జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా దళపతిరాజు సబితా రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మసిస్టుల సంక్షేమం, ఉద్యోగ ఫార్మసీ చట్టాల అమలు, రిజిస్టర్ ఫార్మసిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘాన్ని బలో పేతం చేసే క్రమంలో మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సబితా రాజును సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్మా శంకర్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ మెరుగు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఫసియుద్దీన్, మహ బూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు వేణు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అల్లూరి క్షత్రియ సంఘం అధ్యక్షుడు కేవీఆర్‌ఆర్ వర్మ తదితరులు అభినందించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని జిల్లా యువజన విభాగం అధికారి టి. ఐజయ్య అన్నారు. మండల కేంద్రంలోని కేజేబీవీ పాఠశాలలో మేరాభారత్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ప్రశాంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ అసమతుల్యత ఏర్పడి వర్షాలు సరైన సమయంలో కురవడం లేదని అన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరు మీద మొక్కను నాటి, దానిని తల్లిలాగే కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అల్లాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు
మొయినాబాద్: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి ఉష డీలర్లను హెచ్చరించారు. మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులు, గోదాములు, లైసెన్స్ చెల్లుబాటు, యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఆర్‌పీ ధరలకు ఎరువులను విక్రయించాలని అన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు విక్రయించాలని.. ఇతర వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని సూచించారు. యూరియా నిల్వల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన సమయానికి సరిపడా సరఫరా చేస్తామని చెప్పారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి అనురాధ ఉన్నారు.
పాఠశాలలను
సందర్శించిన రాష్ట్ర బృందం
కొత్తూరు: మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ, పెంజర్ల గ్రామాల్లోని ఎంఎంపీఎస్, జెడ్పీ ఉన్నత పాఠశాలలను ప్రణాళికా సమన్వయకర్తల రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో విద్యార్థుల నమోదు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు బోధన, బోధనేతర అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర బృందం సభ్యుల వెంట మండల విద్యాధికారి అంగూర్ నాయక్ ఉన్నారు.

జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఎన్నిక

జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఎన్నిక