
ప్రభుత్వ పాఠశాలల పనితీరు భేష్
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పనితీరు బాగుందని రాష్ట్ర విద్యాశాఖ బృందం కితాబిచ్చింది. రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్‌లో భాగంగా బుధవారం రాష్ట్ర విద్యాశాఖ బృందం సభ్యులు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల, బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కుంటబడి), ఎంఆర్సీలోని భవిత సెంటర్, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు, డీఐఎస్‌ఈ నమోదు, మధ్యాహ్నభోజన పథకం, పాఠశాలల వివరాల నమోదు, పాఠ్య ప్రణాళికలు, భవిత్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ నరేందర్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆజాద్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శశిధర్‌రెడ్డి, ఎంఈఓ మనోహర్, ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మ, పద్మనళిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ బృందం కితాబు