గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Aug 14 2025 7:49 AM | Updated on Aug 14 2025 7:49 AM

గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

షాద్‌నగర్‌రూరల్‌: ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని మత్స్యశాఖ జిల్లా అధికారిణి పూర్ణిమ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధిని పెంపొందించేందుకు దర్తీ ఆభా జనజాతీయ గ్రామ్‌ ఉత్కర్న్‌ అభియాన్‌ (డీఏజేజీయూఏ) పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకాన్ని పీఎంఎంఎస్‌వై పథకానికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో వ్యకిగతమైన, కమ్యూనిటీ పరమైన యూనిట్లు ఉన్నాయన్నారు. ప్రతి యూనిట్‌ను 10శాతం లబ్ధిదారుడి వాటా, 90శాతం సబ్సిడీ ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. చేపలు పట్టడం, అమ్మడం, రవాణా చేయడం, పెంపకంవంటి అంశాలపై అనుభవం కలిగి స్వయం ఉపాధిని పొందుతున్న గిరిజనులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అధికారులు ఏసుదాసు, అంబేడ్కర్‌, యాదగిరి, గిరిజన నేతలు శ్రీనునాయక్‌, రూప్లానాయక్‌, శ్రీనునాయక్‌, శ్రీను, చందునాయక్‌, గోపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement