
డ్రగ్స్ నిరోధానికి కృషి చేద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేద్దామని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం మిషన్ పరివర్తన సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో నివారించేందుకు పని చేద్దామన్నారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని.. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని.. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి