
మైసిగండిలో ఎమ్మెల్యే పూజలు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ తల్లి ఆలయాన్ని బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ జ్యోతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్ , తులసీరాం, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు ఉన్నారు.