
దళితుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: దళితుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలం అయ్యారని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బి.సామేల్, కార్యదర్శి ప్రకాశ్‌కారత్ విమర్శించారు. సంఘం జిల్లాస్థాయి వర్క్‌షాపు బుధవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటికీ గ్రామాల్లో అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు 25 ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదన్నారు. ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగాలు రాక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 13 ఏళ్లుగా నిధులు కేటాయించడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మనోహర్, వెంకటేశ్, ఆనంద్, వీరేష్, సత్తన్న, కుర్మయ్య, నర్సింహ, జంగయ్య, రాజు పాల్గొన్నారు.