
సీపీఎస్ రద్దు చేయకపోతే ఆందోళన
చేవెళ్ల: సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద 10వేల మందితో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సామల మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల చేవెళ్ల, మల్కాపూర్, గుండాల, కేజీబీవీ, మోడల్ స్కూల్‌లో బుధవారం సంఘం మండల అధ్యక్షుడు దయానందం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పురందాస్, ఉపాధ్యాయులు హోహర్ ఉన్నీసా, దయానందం, రాజశేఖర్, బలరాం, రవీదర్‌రెడ్డి, వెంకటయ్య, కరుణాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.