లాభాల మునగ | - | Sakshi
Sakshi News home page

లాభాల మునగ

Aug 13 2025 7:46 AM | Updated on Aug 13 2025 7:46 AM

లాభాల

లాభాల మునగ

కందుకూరు: మునగ పంట సాగుకు మన రాష్ట్రంలోని నేలలు అనుకూలం. దీంతో ఆశించిన మేర దిగుబడులతో పాటు మంచి లాభాలు అర్జించవచ్చు. అలాగే ఇందులో పోషక విలువలు సైతం సమృద్ధిగా ఉండడంతో ఏ సీజన్‌లోనైనా డిమాండ్‌ ఉంటుంది. జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగానే మునగ సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో మెలకువలు, చేపట్టాల్సిన అంశాలు, సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

నేలలు

నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు మట్టి నేలలు మునగ సాగుకు అనుకూలమైనవి. నీటి వసతి ఉండి సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు.

రకాలు

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన పీకేఎం–1 రకం మునగ సాగుకు అనుకూలమైంది. ఇది నాటిన ఆరు నెలల్లో కాపునకు వచ్చి రెండు సంవత్సరాల్లో మూడు కాపులనిస్తుంది. కాయలు పొడవుగా మంచి కండ కలిగి ఉంటాయి. ఎగుమతికి అనుకూలమైనవి.

మొక్కల పెంపకం

సేకరించిన విత్తనాన్ని కిలోకు 2–3 గ్రాముల కాప్టాన్‌ లేదా మాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేయాలి. రెండు పాళ్లు మంచి ఎర్రమట్టి, ఒక భాగం ఇసుక, ఇంకో భాగం బాగా చివికిన పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని 4●6 సైజులో కింద భాగంలో తగినన్ని రంధ్రాలు గల 150 గేజ్‌ మందం గల పాలిథిన్‌ సంచులలో నింపాలి. ఈ సంచుల్లో విత్తనాన్ని అంగుళం లోతులో విత్తాలి. ప్రతి రోజు నీరు పెట్టాలి. వర్షాకాలంలో పాదులో నేరుగా కూడా విత్తనాన్ని పెట్టవచ్చు. నాటిన 10–12 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. ఒక ఎకరాకు 300 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాలను పాలిథిన్‌ సంచుల్లో విత్తినప్పుడు 40 రోజుల్లో మొక్కలు తోటలో నాటడానికి సిద్ధమవుతాయి.

నాటడం

పొలాన్ని దున్ని కలుపు లేకుండా శుభ్రం చేయాలి. 2.5●2.5 మీటర్ల దూరంలో అడుగు లోతు, అడుగు వెడల్పుతో గుంతలు తీసి, తవ్విన మట్టిని భూసారాన్ని బట్టి 5–10 కిలోల మాగిన పశువుల ఎరువు, 200 గ్రాముల సూపర్‌, 25 గ్రాముల 4 శాతం ఎండోసల్ఫాన్‌ పొడి మందు కలిపి గుంతలు పూడ్చి అందులో మొక్కల్ని నాటి నీరు పెట్టాలి.

నీరు కట్టడం

మొక్క పెరిగే దశలో 8–10 రోజులకోసారి, పూత, కాయదశలో 6–7 రోజులకోసారి అవసరాన్ని బట్టి నీటి తడి ఇవ్వాలి. డ్రిప్పు ద్వారా రోజు విడిచి రోజు 10–15 లీటర్ల నీరు ఇవ్వాలి.

ఎరువులు

పిందె పడిన దగ్గర నుంచి 25–30 రోజులకోసారి చెట్టుకి 75–100 గ్రాముల 17ః17ః17 ఎరువును వేయాలి. దీంతో కాయ పరిమాణం పెరుగుతుంది.

సస్యరక్షణ

పూతదశలో చీడపట్టకుండా 10 లీటర్ల నీటికి 20 మి.లీ రోగార్‌, 2 గ్రాముల మాంకోజెబ్‌, 2 మి.లీ ఫ్లానోఫిక్స్‌ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో ఫ్రూట్‌టాప్‌ ఆశించకుండా 2 మి.లీ మలాథియాన్‌ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. ఈగ ఆశించి నల్లబడిన పిందెలను, కాయలను ఎప్పటికప్పుడు కోసి తొలగించాలి.

పంటలో సస్యరక్షణ చర్యలే కీలకం

నీటి వసతి నేలలు అనుకూలం

కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుడు శ్రీకృష్ణ

లాభాల మునగ1
1/1

లాభాల మునగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement