తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు అమ్మవారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ క్రతువును చూడటానికి లక్షలాది భక్తులు, శివసత్తులు తరలివచ్చారు. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. రావిర్యాల నుంచి ఆలయం వరకు అమ్మవారి ఘటం, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీరాములుయాదవ్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్‌రావు, మీగడ కాశీనాథ్, పాలక మండలి సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పల్లవి, శ్రీలత, అర్జున్, బాల్‌రాజ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
● అంగరంగ వైభవంగా సూర్యగిరి వార్షికోత్సవాలు
ఎల్లమ్మా.. బైలెల్లినాదో
ఎల్లమ్మా.. బైలెల్లినాదో
ఎల్లమ్మా.. బైలెల్లినాదో