
రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి
షాబాద్: జనాభాలో సగ భాగమైన బీసీలు సంఘటితమై రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుర్వగూడ గ్రామంలో బీసీ సేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రమేశ్‌యాదవ్, ఉపాధ్యక్షుడిగా రాము, ప్రధాన కార్యదర్శిగా యాదయ్యగౌడ్ తదితరులను సభ్యులుగా ఎనుకున్నారు. సర్ధార్‌నగర్‌లో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కాసముని మల్లేశ్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలన్నారు. దేశ వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసి గ్రామ స్థాయి నుంచి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించి హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీ సేన రాజకీయ పార్టీలకతీతంగా పని చేస్తుందన్నారు. చట్ట సభలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, బీసీ సేన జిల్లా, మండల సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ