
మహిళలను పొదుపు సంఘంలో చేర్చాలి
కొందుర్గు: ప్రతి మహిళను పొదుపు సంఘంలో చేర్పించాలని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ నర్సింలు అన్నారు. మంగళవారం మండల సమాఖ్యలో మహిళా సంఘాల సభ్యురాళ్లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. గ్రామాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలందరినీ స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలన్నారు. దివ్యాంగులు, వృద్ధ మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కారు లక్ష్యమన్నారు. మహిళల జీవనోపాదులను మెరుగు పర్చుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భారతమ్మ, ఉపాధ్యక్షురాలు ఎ.భారతమ్మ, కోశాధికారి లక్ష్మీనర్సమ్మ, సీసీ లక్ష్మి, సరళ, జంగయ్య, నర్సింలు వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.