
ఏర్పాట్లపై అసహనం
సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి భట్టి అసహనం వ్యక్తంచేశారు. సభావేదిక వద్ద సరైన వసతులు లేకపోవడంపై కినుక వహించారు. వర్షం కారణంగా టెంట్లు తడిసిపోవడంతో పాటు నేలపై వాన నీరు నిల్వడంతో ఇబ్బంది పడ్డారు. భట్టి మాట్లాడినంత సేపు స్థానిక నాయకులు కురుస్తున్న టెంట్ కిందే నిలబడ్డారు. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ గ్రామం పేరు లేదని ముర్తూజగూడ వాసులు అధికారులను నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సభావేదికపై కూర్చుని ప్రొటోకాల్ ఉల్లంఘించారు.