
ఆర్టీసీకి గిరాఖీ
మూడు రోజులు.. రూ.1.20 కోట్ల
ఆదాయం ఇలా
షాద్‌నగర్: రాఖీ పండుగ సందర్భంగా షాద్‌నగర్ డిపో నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సు లను నడిపించారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 1.65లక్షల మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఫలితంగా సంస్థకు మూడు రోజుల్లో రూ.1.20లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లలో అధికారులు స్పెషల్ సర్వీసులు పెంచి ఆదాయం గడించారు.
‘మహాలక్ష్మి’ల ప్రయాణం
రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 1.09లక్షల మందికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. ఈనెల 8న 29,594 మంది 9న 42,072 మంది, 10న 38,262 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.77.24 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో పండుగ ఒక్క రోజే రూ.31లక్షలకు పైగా ఆదాయం చేరింది.
రద్దీకి అనుగుణంగా బస్సులు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించారు. అదనపు ట్రిప్పులతో పాటు, హైదరాబాద్ ఇతర డిపోల నుంచి బస్సులను తెప్పించి నడిపించారు. డ్రైవర్లు, కండక్టర్లు అధికారులు సిబ్బంది పండుగ రోజు సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వామ్యమై సంస్ధకు ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు.11 ఎస్‌డిఎన్‌ఆర్ 803 బీ) ఉష, ఆర్టీసీ డిపో మేనేజర్, షాద్‌నగర్
రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపాం
రాఖీ పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపించాం. ఫలితంగా మూ డు రోజుల్లో 1.65 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఫలితంగా సంస్ధకు రూ .1.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
– ఉష, ఆర్టీసీ డిపో మేనేజర్, షాద్‌నగర్
తేదీ ప్రయాణికులు వచ్చిన ఆదాయం
8న 47,540 రూ.27.98 లక్షలు
9న 61,076 రూ.47.03 లక్షలు
10న 56,988 రూ.45.71 లక్షలు

ఆర్టీసీకి గిరాఖీ