
ఏఈఈలకు పదోన్నతులు
డీఈఈలుగా ప్రమోషన్, బదిలీ
కేశంపేట: ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతులు లభించాయి. షాద్‌నగర్ పరిధి ఫరూఖ్‌నగర్ మండలంలో ఏఈఈగా పనిచేస్తున్న సుజాతను నారాయణపేటకు, కొందుర్గు మండలంలో పనిచేస్తున్న క్రాంతిని వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్‌ఈ కార్యాలయానికి, కేశంపేటలో విధులు నిర్వర్తిస్తున్న గీతను వనపర్తికి, రేఖను జహీరాబాద్, మాధవిని జగిత్యాల జిల్లాకు బదిలీ చేస్తూ, ప్రమోషన్లు కల్పించారు.
విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి
కొందుర్గు: విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివారలు.. గ్రామానికి చెందిన రాయికంటి బలరాం పాడిగేదెలను పోషిస్తూ జోవనోపాధి పొందుతున్నాడు. పాడిగేదెను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కుగురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
గుంతల రోడ్డుపై నిరసన
యాచారం: వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని తక్కళ్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తక్కళ్లపల్లి– తక్కళ్లపల్లి గేట్ మధ్యన ధ్వంసమైన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తంచేశారు. అధ్వానంగా మారిన రోడ్డుతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో బీజేపీ నాయకులు పగడాల శ్రీశైలం, కుమార్ యాదవ్, డాక్టర్ సురేందర్, గడల సురేష్, బాబురావు, నర్సింహ, అంజయ్య, రాములు ఉన్నారు.
మలక్‌పేట: విద్యుదాఘాతంతో ఓ ఉద్యోగి మృతి చెందిన సంఘటన సోమవారం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపిన మేరకు.. మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్‌లో ఎఫ్‌ఓసీ ఫీల్డ్ వర్కర్ ఆర్టిసన్ ఉద్యోగి అంజద్(42) విధినిర్వహణలో ఉండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏఈఈలకు పదోన్నతులు

ఏఈఈలకు పదోన్నతులు

ఏఈఈలకు పదోన్నతులు

ఏఈఈలకు పదోన్నతులు