
పండుగ రోజున రూ.13లక్షలు అదనం
ఇబ్రహీంపట్నం: రాఖీ పండుగ రోజున ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీపోనకు రూ.41లక్షల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి పథకం నుంచి రూ.27లక్షలు కాగా నగదు రూపేనా రూ.14లక్షల ఆదాయం వచ్చింది. డిపోలో 86 ఆర్టీసీ, 61 అద్దె బస్సులుండగా పండుగ రోజున అదనంగా మరో 11 సర్వీసులు అదనంగా పెంచారు. పండుగ రోజున 40 వేల మంది ప్రయాణికుల్లో 25 వేల మంది మహిళలు ఉన్నారు. మాల్ నుంచి మహాత్మాగాంధీ(ఎంజీబీఎస్), సికింద్రాబాద్ రూట్లలో ఎక్కువ ఆదాయం సమకూరింది. వర్షం, ట్రాఫిక్ జామ్ కారణంగా సకాలంలో బస్సులు రాకపోకలు సాగించక పెట్టుకున్న టార్గెట్‌కన్నా రూ.70 వేల ఆదాయం తక్కువగా వచ్చింది. ఈ డిపోకు నిత్యం సుమారు రూ.28 లక్షల ఆదాయం వస్తుంది. రాఖీ పర్వదినాన రూ.13 లక్షల ఆదాయం అదనంగా సమకూరింది.
ఆదాయం పెరిగింది
రాఖీ పర్వదినాన ఆర్టీసీ ఆదాయం పెరిగింది. మహిళ ప్రయాణికులు సుమారు 25 వేల మంది ఉచితంగా ప్రయాణించారు. డిపోకు రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న టార్గెట్ సాధించలేకపోయాం.
– వెంకట నర్సప్ప,
డిపో మేనేజర్, ఇబ్రహీంపట్నం

పండుగ రోజున రూ.13లక్షలు అదనం