
లక్ష్మీకటాక్షం
మహేశ్వరం: రక్షా బంధన్ రోజున మహేశ్వరం ఆర్టీసీ డిపోకు లక్ష్మీకటాక్షం లభించింది. రాఖీ పండుగ నేపథ్యంలో మహేశ్వరం డిపో పరిధిలో 26,580 కిలో మీటర్ల దూరం సర్వీసులు నడిచాయి. పండుగ ఒక్క రోజే డిపోకు రూ.23.24లక్షల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మీ పథకం కింద 48 వేల మంది మహిళలు ప్రయాణించగా రూ.13.96లక్షల ఆదాయం వచ్చింది.
●
సమష్టి కృషి
రాఖీ పండుగ నేపథ్యంలో రూ.23.24లక్షల ఆదాయం సమకూరింది. డిపోలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమష్టి కృషితో ఆదాయం గడించాం.
– లక్ష్మీ సుధ, ఆర్టీసీ డిపో మేనేజర్, మహేశ్వరం

లక్ష్మీకటాక్షం