
తెలంగాణ మోడల్ స్కూల్‌గా కేంద్రీకృతం చేయండి
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి
కడ్తాల్: పంచాయతీ పరిధిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్(బాలుర, బాలికల), ప్రాథమికోన్నత పాఠశాలలను తెలంగాణ మోడల్ స్కూల్‌గా కేంద్రీకృతం చేయాలని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సిహారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలోని తెలంగాణ విద్యా కమిషన్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి జీనత్పర్ అజ్మీ సయ్యద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో 700 మంది వరకు విద్యార్థులు, 45 మంది ఉపాధ్యాయులున్నారని వీరిని తెలంగాణ మోడల్ స్కూల్ విధానంలో ఏకీకృతం చేయాలని కోరారు.