
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
షాద్‌నగర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం దేవునిగుడితండాకు చెందిన కేతావత్ దేవ్లీ(70) ఈ నెల 7న మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామ పంచాయతీ పరిఽధి ఉడిత్యాలతండాలో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లింది. తిరిగి ఆదివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ఆమె షాద్‌నగర్‌కు వచ్చింది. గిరిజనుల అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తుండగా.. స్థానికంగా డయోగ్నిస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్ శ్వేత తన కారును పార్కింగ్ చేసే క్రమంలో దేవ్లీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.