
ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఇంట్లో విషాదం
హయత్‌నగర్: రాఖీ పౌర్ణమి రోజున ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే అక్క వంగేటి భూదేవి(75) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి చనిపోయారు. ఆమెకు ఒక అక్క, తమ్ముళ్లు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మల్‌రెడ్డి యాదిరెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డితో పాటు ఒక సోదరి ఉన్నారు. ఆమె మృతితో స్వగ్రామం తొర్రూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు.