
ప్రారంభమైన పనులకు శంకుస్థాపన
మొయినాబాద్: ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికై నా నిధులు మంజూరైన వెంటనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతారు. కానీ మున్సిపల్ పరిధి లో విద్యుత్ అధికారులు మాత్రం వింతపోకడ అవలంబిస్తున్నారు.ఆరు నెలల క్రితమే పనులు మొద లైన కొనసాగుతున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సోమ వారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు చేతులమీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడ రెవెన్యూలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ఆరు నెలల క్రితమే పనులు మొదలు పెట్టారు. సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్లు సైతం తెచ్చారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ సమయంలో శంకుస్థాపన చేపట్టడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా డిప్యూటీ సీఎం, మంత్రి రాక సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
రేషన్ కార్డుల పంపిణీ
విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చేతులమీదుగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మండల తహసీల్దార్ గౌతమ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి లబ్ధిదారులు, అధికారులు హాజరు కావాలని సూచించారు.
ముర్తూజగూడలో ఏర్పాటవుతున్న విద్యుత్ సబ్‌స్టేషన్
ఆరు నెలల క్రితమే మొదలై కొనసాగుతున్న పనులు
నేడు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు
స్థానికంగా చర్చనీయాంశం