
ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ వాగు
చేవెళ్ల: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఎగువ ప్రాంతాలైన వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి ప్రాంతాలతోపాటు చేవెళ్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద వాగులో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే హిమా యత్‌సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక అడుగు తక్కువగా ఉండడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈసీ వాగులో వరద పెరగడంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు వురుస వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.