
ఫార్మా భూముల్లో హెలిక్యాప్టర్ చక్కర్లు
ఆసక్తిగా గమనించిన స్థానికులు
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన యాచారం, కందుకూరు మండలాల్లోని భూములపై ఆదివారం సాయంత్రం హెలిక్యాప్టర్ చక్కర్లు కొట్టింది. యాచారం మండల పరిధిలోని కుర్మి ద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి, కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో హెలిక్యాప్టర్ అతి దగ్గరగా చక్కర్లు కొట్టడం స్థానికులు ఆసక్తిగా గమనించారు. కొన్ని నెలలుగా రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ అధికారులు ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే చేసి, ఫెన్సింగ్ వేశారు. వారం రోజులుగా పరిహారం ఇచ్చి సేకరించిన సర్వే నంబర్లలోని రైతుల వారీగా కబ్జా భూములను సర్వే చేస్తున్నారు.