మైసిగండిలో మహాద్భుతం
చెరువెండుతోంది! యాచారం మండల పరిధిలోని మెజార్టీ చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి.
8లోu
కడ్తాల్: దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆపద మొక్కులు తీర్చే దేవతగా, భక్తులు ఇలవేల్పుగా, నిత్యం దేదీప్యమానంగా వెలుగొందుతున్న మైసమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప ఘట్టం భక్తులను మైమరిపించింది. ఉదయం 11.58 నుంచి మధ్యాహ్నం 12.06 గంటల వరకు సూర్యభగవానుడి కిరణాలు అమ్మవారి విగ్రహంపై మెరుపులా ప్రసరించాయి. ఆలయ విమాన గోపురం మీదుగా గర్భగుడిలోని మైసమ్మ తల్లి నుదుటిపై పడిన కిరణాలు ప్రత్యేక వెలుగులు ప్రసరింపజేశాయి. గతేడాది మే14న సైతం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
అమ్మవారి నుదుటిపై సూర్యకిరణాలు
అమ్మవారిపై సూర్యభగవానుడి కిరణాలు


