బార్‌లో కల్తీమద్యం
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు
● ప్రీమియం మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యంతో కల్తీ
● రూ.1.48 లక్షల విలువైన కల్తీమద్యం పట్టివేత
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ బార్ కల్తీ మద్యం విక్రయాలకు తెరలేపింది. ఖరీదైన ప్రీమియం మద్యం బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపి వినియోగదారులకు అందజేస్తుండగా ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్‌ను కొంతకాలంగా లైసెన్స్ పునరుద్ధరించకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎకై ్సజ్ సిబ్బందితో కలిసి శుక్రవారం బార్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బార్‌లోని పనిచేసే కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్‌లు కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని వాటిలో కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.2690 ధర కలిగిన జేమ్‌సన్ బాటిళ్లలో రూ.1000 ధర కలిగిన ఓక్‌స్మిత్ మద్యాన్ని కలుపుతున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు గుర్తించారు. ఇలా వివిధ రకాల బ్రాండ్‌లకు చెందిన 75 మద్యం బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎకై ్సజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ట్రూప్ బార్ లైసెన్స్ ఫీజ్ చెల్లించకపోవడమే కాకుండా మద్యం డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలిపారు. డిపోల నుంచి కొనుగోలు చేయడానికి బదులు వైన్‌షాపుల నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధర కలిగిన బాటిళ్లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలుపుతూ అమ్మకాలు చేపడుతున్నట్లు ఎకై ్సజ్ విచారణలో వెల్లడైంది. మొత్తం రూ.1.48 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నారు. బార్ యజమాని ఉదయ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణరెడ్డి, బార్‌లో పనిచేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపైన కేసు నమోదు చేసినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు.


