కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
చేవెళ్ల: రాబోయేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, పార్టీకోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని ప్రగతి భవన్‌లో ఆదివారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి వార్డుకు చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ శ్యామలయ్య తన అనుచరులతో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో బలమైన నాయకురాలిగా సబితారెడ్డి మీకు అండగా ఉంటుందని చెప్పారు. సబితారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.


