నేడు మంత్రుల పర్యటన
చేవెళ్ల: నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రుల పర్యటన ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లిలో కోట్లరూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన ఐదు మండలాల సర్పంచులకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్‌లో మంత్రుల చేత సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కందుకూరు: స్వామి వివేకానంద సేవారత్న పురస్కారం–2026 మండల పరిధిలోని కొత్తగూడ మాజీ సర్పంచ్ సాధ మల్లారెడ్డి అందుకున్నారు. స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని సమాజ సేవ, ప్రజా సేవలో విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం (టీఐఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. టీఐఎఫ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ రాజనారాయణముదిరాజ్, మహ్మద్ అక్తర్‌అలీ, డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు కొంతం జంగారెడ్డి తదితరులు మల్లారెడ్డిని అభినందించారు.
ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామానికి చెందిన పోకల్‌కార్ కిషన్‌ప్రసాద్‌జీ హైదరాబాద్ సర్కిల్ ఉత్తమ పోస్ట్‌మాన్‌గా అవార్డు దక్కించుకున్నారు. రాష్ట్రంలో పోస్ట్‌మాన్‌గా ఉత్తమ సేవలందిస్తున్న 12 మందిని ఎంపిక చేశారు. అందులో వనస్థలిపురం పోస్టాఫీస్‌లో పోస్టుమాన్‌గా పనిచేసే దండుమైలారం గ్రామానికి చెందిన పి. కిషన్‌ప్రసాద్‌జీ ఎంపికయ్యారు. నగరంలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోస్టు మాస్టర్ జనరల్ మేనేజర్ (పీఎంజీ) సుమిత్రఅయోధ్య, హైదరాబాద్ పోస్టల్ డిపార్టమెంట్ సీనియర్ సూపరింటెండెంట్ హేమలత చేతుల మీదుగా కిషన్‌ప్రసాద్ అవార్డు అందుకున్నారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు యాదగిరిస్వామి, స్థానిక నాయకులు తులసీరాంనాయక్, సాయికుమార్ ఉన్నారు.
మంచాల: ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్టు తపస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తారి రాజిరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు జె.కరుణాకర్‌రెడ్డితో పాటు వివిధ మండలాలకు చెందిన సంఘం బాధ్యులు తపస్‌లో చేరారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నేడు మంత్రుల పర్యటన
నేడు మంత్రుల పర్యటన


