వడ్డెర్ల సంక్షేమానికి.. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర
బస్టాండ్ కిటకిట
‘పల్లె’టూరుకు..
షాద్‌నగర్: పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు కొందరు.. బంధువుల వద్దకు వెళ్లే వారు మరికొందరు.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇంటికి వచ్చేవారు ఇంకొందరు.. సెలవులు కావడంతో సరదాగా టూర్లు వెళ్లే వారు మరికొందరు.. ఇలా అంతా ఒక్కసారిగా ప్రయాణం మొదలు పెట్టడంతో షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌గేట్ వద్ద వేలాది వాహనాలు క్యూ కడుతున్నాయి.
రహదారులపై రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. రహదారులు, బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, అనంతపురం, కడప తదితర ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే వారు 44వ జాతీయ రహదారి పై నుండి వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. దీంతో షాద్‌నగర్ పరిధిలో ఉన్న జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది.
నిమిషానికి 30 వాహనాలు
షాద్‌నగర్ మీదుగా ఉన్న 44వ జాతీయ రహదారిపై పండగ సందర్భంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 నుంయి ఆదివారం సాయంత్రం 5గంటల వరకు 30వేల వాహనాల టోల్ గేటు నుంచి వెళ్లాయి. అంటే నిమిషానికి సుమారు 30 వాహనాలు టోల్ గేట్ దాటినట్లు లెక్క. ఒక్కో వాహనంలో సుమారు నలుగురు ప్రయాణించినా 17 గంటల్లో 30వేల వాహనాల్లో లక్షా 20వేల మంది గమ్యస్థానాలకు చేరినట్లు అంచనా. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్‌గేట్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 గేట్‌ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ రుసుము చెల్లించేందుకు ప్రత్యేక గేటును ఏర్పాటు చేశారు.
పండగ సందర్భంగా బస్సుల్లో వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో షాద్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు బస్సులు నడిపిస్తున్నారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనం
రాయికల్ టోల్‌గేట్ వద్ద వాహనాల క్యూ
కిటకిటలాడుతున్న బస్టాండ్లు
వడ్డెర్ల సంక్షేమానికి.. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర


