కురుమలు రాజకీయంగా ఎదగాలి
మీర్‌పేట: కురుమలు అన్ని వర్గాలను కలుపుకొని, రాజకీయంగా ఎదగాలని మాజీ ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం అన్నారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధాల దశరథ అధ్యక్షతన ఆదివారం మీర్‌పేటలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించాలని త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. కొన్ని జిల్లాల్లో భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కురుమలు పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, బాలాపూర్ మండల అధ్యక్షుడు ఇక్కె సత్యనారాయణ, మీర్‌పేట, జిల్లెలగూడ అధ్యక్షులు దేవరింటి వెంకటేశ్ కురుమ, సిద్ధాల జగదీష్ కురుమ, చినింగి బాలయ్య, నారి సత్యనారాయణ, అచ్చెన యాదగిరి కురుమ, మేకల ప్రశాంత్, ప్యాట నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం


