
ప్రైవేటు ఆస్పత్రులపై కొరడా
మీర్‌పేట: ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి దుర్వినియోగానికి పాల్పడిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. కార్పొరే షన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలోని హిరణ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం కొంత కాలంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి తప్పు డు బిల్లులతో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై వైద్య శాఖ విచారణ చేపట్టింది. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి గీత ఉన్నారు.
కేసులు నమోదు చేసి విచారణ..
హుడాకాంప్లెక్స్: తప్పుడు వైద్య బిల్లులు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝులిపించింది. సరూర్‌నగర్ మండల పరిధిలోని ఎంఎంఎస్, ఇందిరా ఆస్పత్రులను మంగళవారం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా ఆస్పత్రులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిందని అన్నారు.