రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం
కడ్తాల్: దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. పీసీసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన జైబాపు, జై సంవిధాన్ పాదయాత్ర ఆదివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టామన్నారు. బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు. సకల జనహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమాభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎస్సీసెల్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జగన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు హన్మానాయక్; యాదగిరిరెడ్డి, రామకృష్ణ, శంకర్, జగన్‌గౌడ్, జహంగీర్‌అలీ, సత్యం, సుమన్, కేశవులు, యాదగిరిరెడ్డి, వెంకటేశ్, నరేశ్‌నాయక్, షాబుద్దీన్, ఇమ్రాన్, జవహర్, యాదయ్య, రాజుగౌడ్, రాంచందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సకలజనహితమే కాంగ్రెస్ లక్ష్యం
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


