సీఎస్‌ఆర్ నిధులతో చెరువుల పరిరక్షణ
కొత్తూరు: చెరువుల పరిరక్షణకు పారిశ్రామిక దిగ్గజాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం ఆయన అమెజాన్, సేట్రీస్ సంస్థల సహకారంతో కొత్తూరు పట్టణంలో చేపట్టనున్న సాయిరెడ్డి చెరువు అభివృద్ధి పనులను ప్రా రంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు బహుళజాతి పరిశ్రమలు అనుసరిస్తున్న విధానం సంతోషకరమన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి భారీ వర్షాలు కురిసినప్పటికీ వివిధ కారణాల వల్ల వరద నీరు చేరడం లేదన్నా రు. మరికొన్ని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం చాలా వరకు తగ్గిందన్నారు. దీంతో భూగర్భ జలా లు త్వరగా అడుగుంటుతున్నాయని వివరించారు. బహుళజాతి పరిశ్రమలు సీఎస్‌ఆర్ నిధులతో చెరువుల పరిరక్షణతో పాటు భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లో సత్ఫలితాలిస్తాయన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సంస్థలకు రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సహకారం అందించాలని కోరారు. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సేట్రీస్ సంస్థ సీఈఓ దేవకాంత్, ప్రతినిధులు అమరేందర్, సురేశ్, షహనాజ్ అన్సారీ, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, నాయకులు సుదర్శన్‌గౌడ్, దేవేందర్‌ముదిరాజ్, హరినాథ్‌రెడ్డి, దేవేందర్‌యాదవ్, శ్రీను, గోవింద్‌నాయక్, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


