ఆత్మరక్షణకు కరాటే దోహదం
షాబాద్: బాలికలకు చదువు ఒక్కటే సరిపోదని, ఆపద సమయంలో ఆత్మరక్షణకు కరాటే దోహపడుతుందని జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా, తెలంగాణ స్కూల్ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు చెన్న య్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధి ఆస్పల్లిగూడ గ్రామ శివారు కై ట్ కళాశాలలో నిర్వహించిన కరాటే బెల్ట్ పోటీల్లో ఎంజెపీ మొగిలిగిద్ద గురుకుల పాఠశాల విద్యార్థినులు 29 మందిగ్రేడింగ్ ఉత్తీర్ణత సాధించారు. ఇందులో డబుల్ ప్రమోషన్ జయశ్రీ ఎల్లో, మేఘన ఆరెంజ్, శ్రావ్య ఎల్లోతో పాటు మరో 27 జూనియర్ రెడ్ బెల్టులు పొందారు. ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరంజని, పీటీ రేణుక, పద్మిని తదితరులు పాల్గొన్నారు.


