విపత్తుల సమయంలో జాగ్రత్తలు అవసరం
కలెక్టర్ నారాయణ రెడ్డి
నందిగామ: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మండల పరిధిలోని మేకగూడ శివారులో నాట్కో పరిశ్రమ ఆవరణలో సోమ వారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. అకస్మాత్తుగా విపత్తు సంభవించినట్లయితే శాఖల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అగ్నిమాపక శాఖ, వైద్య శాఖతో పాటు పలు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షత గాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు, మందుల లభ్యత చూసుకోవాలని.. ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలనేది ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, ఇన్‌స్పెక్టర్ ప్రసా ద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ఏ పెంచాలని వినతి
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్‌ఎంసీకి ఎని మిది కిలోమీటర్ల పరిఽధి వరకు హెచ్‌ఆర్‌ఏ 24 శాతం పెంచాలని టీజీఓ, పీఆర్‌టీయూ టీఎస్ ఉద్యోగ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు వారు సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ పరిధికి చుట్టు పక్కల ఎనిమిది కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 24 శాతం ఇంటి అద్దె భత్యం మంజూరు చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.రామారావు, పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామల మహేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్, రాకేశ్, నాగేశ్వర్‌రావు, మసూద్ అలా, జగన్మోహన్‌గుప్తా, ఎనిమిది మండలాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు .
మరకత శివాలయానికి బోయపాటి
శంకర్‌పల్లి: ఆకుపచ్చ రంగులోని మరకత శివలింగం ఎంతో ప్రత్యేకంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. సో మవారం మండల పరిధిలోని చెందిప్పగ్రామంలో వెలిసిన 11వ శతాబ్ధపు మరకత శివాలయా న్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి బోయపాటికి ఆ లయ ప్రతిమ అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులు సదానందం గౌడ్, దర్శన్ గౌడ్, జనార్ధన్, అర్చకులు సాయి శివ, ప్రమోద్ పాల్గొన్నారు.
‘సాందీపని’లో అడ్మిషన్లకు 4న ప్రవేశ పరీక్ష
తాండూరు: తాండూరు మండలం జినుగుర్తిలోని సాందీపని గురుకులంలో అడ్మిషన్లకు జనవరి 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడ ప్రాచీన వేద విద్యతో పాటు ఆధునిక ఏఐ సాంకేతికతతో కూడిన బోధన ఉంటుందని తెలిపారు. 2026– 27 విద్యాసంవత్సరానికి గానూ 4వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు. ప్రవేశ పరీక్ష అనంతరం, ఇంటర్వ్యూ, శిక్షణ కాలంలో విద్యార్థి ప్రదర్శించే ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై న వారికి ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే ప్రవేశం. అడ్మిషన్ సమయంలో రూ.25,000 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది విద్య పూర్తైన తర్వాత తిరిగి ఇస్తారు. వివరాల కోసం 9154795530 నంబర్‌లో సంప్రదించండి.
విపత్తుల సమయంలో జాగ్రత్తలు అవసరం
విపత్తుల సమయంలో జాగ్రత్తలు అవసరం


