కొలువుదీరిన కొత్త పాలకమండళ్లు
ఏకకాలంలో 525 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులప్రమాణ స్వీకారం కొత్త పాలకవర్గాలతో కళకళలాడుతున్న గ్రామ పంచాయతీలు గ్రామస్తుల నుంచి అభినందనలవెల్లువ..శాలువాలు, బొకేలతో సన్మానం
మహేశ్వరం: ప్రమాణం చేస్తున్న పెండ్యాల పాలకవర్గం
కొత్తూరు: పెంజర్లలో ప్రమాణస్వీకారం చేయిస్తున్న
తహసీల్దార్ రవీందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండేళ్లుగా పాలక మండళ్లు లేక బోసిపోయిన గ్రామ పంచాయతీలు..సోమవారం పాలక మండళ్ల సభ్యులతో కళకళలాడాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఆయా పంచాయతీల కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. రాగద్వేషాలకు, బంధుప్రీతికి అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని పేర్కొంటూ కొంత మంది రాజ్యాంగంపై ప్రమాణం చేయగా, మరికొంత మంది దైవసాక్షిగా, ఇంకొందరు ఆత్మ సాక్షితో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా కొలువుదీరిన సభ్యులను శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో 21 మండలాల పరిధిలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో ఒకటి మినహా మిగిలిన 525 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు 4,665 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులతో గ్రామస్తులు, ఓటర్ల సమక్షంలో ఆయా పంచాయతీ భవనాల ముందు ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ల కింద ప్రమాణ స్వీకారం చేయించారు.
కొలువుదీరిన కొత్త పాలకమండళ్లు
కొలువుదీరిన కొత్త పాలకమండళ్లు


