ధ్యానం.. పరమ ఔషధం | - | Sakshi
Sakshi News home page

ధ్యానం.. పరమ ఔషధం

Dec 23 2025 8:16 AM | Updated on Dec 23 2025 8:16 AM

ధ్యాన

ధ్యానం.. పరమ ఔషధం

● ధ్యాన గురువు పరిమళ పత్రి

కడ్తాల్‌: ధ్యానం పరమ ఔషధమని ధ్యాన గురువు పరిమళ పత్రి అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 సోమవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సంజయ్‌ కింగీ ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానగురువు పరిమళ పత్రి మాట్లాడుతూ.. ఆలోచనలను సరైన స్థితిలోకి తీసుకువెళ్లడమే ధ్యానమన్నారు. నోటి లోని మౌనం, మనసులోని శూన్యమే ధ్యానమని.. అది ఆచరణతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడమే పత్రీజీ కోరుకున్నారని చెప్పారు. అనంతరం యోగా గురువు వెంకటేశ్‌ గురూజీ ధ్యానం, యోగా, ప్రాణాయామం గురించి వివరించారు. అనంతరం పలు ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు, మేగజైన్లను ట్రస్ట్‌ సభ్యులు, పిరమిడ్‌ మాస్టర్లతో కలిసి పరిమళ పత్రి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్‌ మాస్టర్‌ల అనుభవాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్‌ భాస్కరానందా, ట్రస్ట్‌ సభ్యులు హనుమంతరాజు, మాధవి, దామోదర్‌రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.

ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

సాయంత్రం గురువుల ఆధ్యాత్మిక ధ్యాన సందేశాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శాంతి, ధ్యాన సందేశం ఇచ్చిన శ్రీ కృష్ణ చాముండేశ్వరీ మహర్షిని సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తీకేయన్‌తో పాటు ట్రస్ట్‌ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా కళాకారులు ఎంఎస్‌ పార్వతి బృదం ఆలపించిన గీతాలు, సంస్కృతి ముదాల్కర్‌ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ధ్యాన వేడుకలకు సినీ స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ బ్రదర్స్‌, జ్యోతిష్య శాస్త్రవేత్త రవిశాస్త్రి హాజరయ్యారు.

కోలాటం ఆడుతున్న మహిళలు

గురువుతో కలిసి ధ్యానం చేస్తున్న స్టంట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ సోదరులు

ధ్యానం.. పరమ ఔషధం 1
1/3

ధ్యానం.. పరమ ఔషధం

ధ్యానం.. పరమ ఔషధం 2
2/3

ధ్యానం.. పరమ ఔషధం

ధ్యానం.. పరమ ఔషధం 3
3/3

ధ్యానం.. పరమ ఔషధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement