రాజకీయంగా ఎదుర్కోలేకే ఆందోళన
శంకర్‌పల్లి: రాజకీయంగా తనను ఎదుర్కోలేక, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై న పదవిని రద్దు చేయాలంటూ ప్రత్యర్థులు అందోళన బాట పట్టడం విడ్డూరమని శేరిగూడ సర్పంచ్ బొల్లారం నివేదిత అన్నారు. సోమవారం ఆమె సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ప్రభుత్వం కేటాయిస్తేనే తన అక్క ఒక అధికారిగా తన బాధ్యతలు నిర్వహించిందన్నారు. ఆమె విధులు నిర్వర్తించిన బూత్‌లో తనకు మెజారిటీ రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.
ఓడిన అభ్యర్థుల ఆందోళన
ఎన్నికల్లో ఓడిన సర్పంచ్ అభ్యర్థులు, చీర మౌనిక, మైలారం గంగా భవానీ తమ మద్దతుదారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్పంచ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోకిల సీఐ వీరబాబు, ఎస్‌ఐ వారిని సముదాయించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.
శేరిగూడ సర్పంచ్ నివేదిత
రాజకీయంగా ఎదుర్కోలేకే ఆందోళన


