ప్రతీ ఇంటికి సంక్షేమం
కడ్తాల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా పంచాయతీ పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వారు అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మండల కేద్రంలో బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, జూనియర్ కళశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సర్పంచ్‌గా రాయికంటి భిక్షపతి, ఉప సర్పంచ్‌గా ఈరెడ్డి యాదగిరిరెడ్డి, వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిఽధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, నాయకులు వెంకటేశ్, లక్ష్మయ్య వార్డు సభ్యులు పాల్గొన్నారు.


