షాబాద్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మాచన్‌పల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5లక్షల ఎస్‌సీపీ నిధులు కేటాయించడంతో శుక్రవారం ఆయన్ను గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యగౌడ్, నరేందర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, చందు, మహేందర్, శేఖర్, నరేష్, ముసలయ్య, మల్లేష్, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంఽథాలయ సంస్థ
చైర్మన్ మధుసూదన్‌రెడ్డి