‘గులాబీ’ మోసాలను గుర్తించాలి | Sakshi
Sakshi News home page

‘గులాబీ’ మోసాలను గుర్తించాలి

Published Mon, Nov 27 2023 7:10 AM

చేవెళ్ల: మైనార్టీల సమ్మేళనంలో మాట్లాడుతున్న భీంభరత్‌   - Sakshi

చేవెళ్ల: గులాబీ నేతల మోసాలను ముస్లిం, మైనార్టీలు గుర్తించి ఓటుతో బుద్ది చెప్పాలని కాంగ్రెస్‌ చేవెళ్ల అభ్యర్థి పామెన భీంభరత్‌ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాటి నుంచి మైనార్టీలకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. అధికార బీఆర్‌ఎస్‌ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీని విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు వాజిద్‌, ఫరూక్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారం

మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే పేదలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని పామెన మాజీ సర్పంచ్‌ డి.గోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇంటింటికీ ప్రచారం చేస్తూ గ్యారెంటీ కార్డులను అందజేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఈ ప్రచారంలో ఎర్రగోపాల్‌, రాజేందర్‌రెడ్డి, బాబు, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, ప్రశాంత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

విజయం ఖాయం

శంకర్‌పల్లి: చేవెళ్ల అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీంభరత్‌ అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని లచ్చిరెడ్డిగూడ, చిన్నన్నగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు కె.ఉదయమోహన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, శ్రీకాంంత్‌, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రవీందర్‌, సత్యం, నర్సింలు, గోపాల్‌, రాందాస్‌, ప్రశాంత్‌, నరేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దాం

ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ చేవెళ్ల అభ్యర్థి భీంభరత్‌

శంకర్‌పల్లి: భీంభరత్‌కు స్వాగతం పలుకుతున్న చిన్నన్నగూడ గ్రామస్తులు
1/1

శంకర్‌పల్లి: భీంభరత్‌కు స్వాగతం పలుకుతున్న చిన్నన్నగూడ గ్రామస్తులు

Advertisement
 
Advertisement
 
Advertisement