
లిండ్‌స్ట్రోం పరిశ్రమను సీఈఓతో కలిసి ప్రారంభిస్తున్న జయేష్ రంజన్
కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌పాండే
ఇబ్రహీంపట్నం: తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి సందీప్‌దుర్వేతో కలిసి బుధవారం ఆయన బీజేపీ అభ్యర్థి నోమలు దయానంద్ గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందన్నారు. మెజార్టీ స్థానాలు గెలుస్తామని, నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు. ఇబ్రహీంపట్నంలో కమలం వికసించి కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.
పరిశ్రమలకు
స్వర్గధామం తెలంగాణ
నందిగామ: పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదా రులకు మన రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని, ఇప్పటికే అనేక రకాలైన పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పగా, మరెన్నో పరిశ్రమలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్యశాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మండల పరిధిలోని మేకగూడ శివారులో నెలకొల్పిన లిండ్ స్ట్రోం పరిశ్రమను సీఈఓ జుహాలారియోతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సులభతరంగా అనుమతులు ఇవ్వడంతో పాటు రెడ్ కార్పెట్ పరుస్తోందని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఫార్మా పరిశ్రమల్లో ప్రపంచంలోని మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని వివరించారు. అంతే కాకుండా ఐటీ, మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు నెలకొన్నాయని, వాటితో ఎంతో మందికి ఉపాధిసైతం లభిస్తోందన్నారు. అనంతరం పరిశ్రమ సీఈఓ జుహా లారియో మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్లీన్ రూం సదుపాయాన్ని ఇక్కడ కల్పించినట్టు వెల్లడించారు. ఈ పరిశ్రమలో సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ గ్రూప్ సీఈఓ జుహాలారియో, అసియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనుపమ్ చక్రవర్తి, పరిశ్రమ ప్రతినిధి కిమ్, ఎండీ జయంత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

విక్టరీ సింబల్ చూపుతున్న కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌పాండే తదితరులు