గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి

కేశంపేట: నిరుద్యోగులు, యువకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రంథాలయాలకు అదనంగా 30 పౌర పఠన మందిరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మండలంలోని నిర్ధవెళ్లి, వేములనర్వతో పాటు మరికొన్ని మేజర్‌ గ్రామాల్లో పౌరపఠన మందిరాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆరు గ్రంథాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. షాద్‌నగర్‌, శంషాబాద్‌, మంచాల, ఆమనగల్లులో నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మిగతా భవనాల నిర్మాణాలు చేపట్టనున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దినట్టు వెంకటరమణారెడ్డి తెలిపారు. పాఠకులు డిమాండ్‌ చేసిన పుస్తకాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తలసాని వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్‌, మండల గ్రంథాలయ అధికారి శ్రీనివాసరాజు, పంచాయతీ కార్యదర్శి విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top