నిరంకుశ పాలనపై పోరాటం | Sakshi
Sakshi News home page

నిరంకుశ పాలనపై పోరాటం

Published Mon, Mar 27 2023 4:32 AM

షాద్‌నగర్‌లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు  - Sakshi

షాద్‌నగర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని టీపీసీసీ సభ్యుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతలు ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిపై బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే అనర్హత వేటు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ రాహుల్‌గాంధీ వెంటే ఉన్నారని, అవసరం అయితే ఏ త్యాగానికై నా తాము సిద్ధమని అన్నారు. అనర్హత వేటుపై కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. గాంధీ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని, ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతోందన్నారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి గురించి రాహుల్‌గాంధీ మాట్లాడితే బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు. దేశ సమైఖ్య కోసం అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఇటీవల రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన లభించిందన్నారు. దీన్ని చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు దినేష్‌ సాగర్‌, మధు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
Advertisement