న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2026
సిరిసిల్లటౌన్: దీపావళి మార్కెట్‌కు పండుగ కళ తీసుకొచ్చింది. పట్టణంలోని వ్యాపార సంస్థలు శనివారం సందడిగా మారాయి. మహాలక్ష్మీ, కేదారేశ్వర పూజల కోసం అవసరమైన సామగ్రి, పూజా ద్రవ్యాలు, అరటి పత్రాలు, మామిడాకుల తోరణాలు, కొబ్బరి ఆకులతో ఆయా వ్యాపారసంస్థల ఎదురుగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దీపావళి అమ్మకాలతో పట్టణంలో మార్కెట్లో కొబ్బరికాయలు, ప్రసాద సామగ్రి, ప్రమిదలు, పటాకులు, అరిటాకులు, కొబ్బరిమట్టలు, గుమ్మడికాయల కొనుగోళ్లు పెరిగాయి. స్థానికంగా తయారైన వాటితోపాటు అంతర్ రాష్ట్రాల నుంచి దిగుమతైన ప్రమిదలు ఆకర్షణీయమైన డిజైన్లలో ఆకట్టుకున్నాయి. వివిధ వ్యాపార, వాణిజ్య, గృహ సముదాయాలు విద్యుత్‌దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణ శివారులోని రగుడు వద్ద హోల్‌సేల్ టపాసుల దుకాణం, మానేరువాగులో ఏర్పాటు చేసిన తాత్కాలిక టపాసుల దుకాణాల వద్ద అమ్మకాలు జోరుగా సాగాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి వేలాది సంఖ్యలో జనం టపాసులను కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం అమ్మకాలు జరిగేలా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్, లీగల్మెట్రాలజి అధికారులు చర్యలు చేపట్టారు.


