సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పాత నేరస్తులపై జిల్లా పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని ఎస్పీ మహేశ్ బీ గీతే శనివారం తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి పాత నేరస్తుల ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలు సేకరించారు. మళ్లీ నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగుతుందన్నారు. ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్‌లు, సీఐలు, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


