అతివలే అధిపతులు ! | - | Sakshi
Sakshi News home page

అతివలే అధిపతులు !

Nov 8 2026 12:07 AM | Updated on Nov 8 2026 12:07 AM

రాణిస్తున్న మహిళా ప్రిన్సిపాళ్లు బోధనతో పాటు బాధ్యతలు డిగ్రీ, జూనియర్‌, మోడల్‌ కళాశాలలకు మహిళలే సారథులు

గంభీరావుపేట: ఒకప్పుడు విద్యారంగంలో బోధనకే పరిమితమవుతారనే భావన ఉన్న మహిళలు.. నేడు విద్యాసంస్థల నిర్వహణలోనూ సత్తా చాటుతున్నారు. ఉన్నత విద్యాసంస్థలకు అధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. గంభీరావుపేట మండలంలో పలు ఉన్నత విద్యాసంస్థలకు మహిళా ప్రిన్సిపాళ్లే నాయకత్వం వహిస్తున్నారు.

కళాశాలలన్నింటికీ ‘ఆమె’

గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాలల్లో మహిళా ప్రిన్సిపాళ్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యాసంస్థల నిర్వహణ నుంచి ప్రమాణాల పెంపు వరకు విజయవంతంగా ముందుకెళ్తున్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమన్వయం, విద్యార్థుల హాజరు, బోధన ప్రణాళికలు, పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ విద్యాకార్యక్రమాల అమలు వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

బోధన.. పరిపాలన

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా మహిళా ప్రిన్సిపాళ్లు ముందుకుసాగుతున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఉన్నత విద్యపై ఆసక్తి పెంచేలా చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు విద్యార్థుల విద్యాప్రగతిపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారు.

మహిళా నాయకత్వానికి నిదర్శనం

విద్యాసంస్థలకు మహిళలే అధిపతులుగా వ్యవహరిస్తుండడం మహిళా సాధికారతకు అద్దం పడుతోంది. బాధ్యతలు ఏవైనా సమర్థత, అంకితభావం, నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా విద్యావ్యవస్థను ముందుకు నడిపించే నాయకులుగాను మహిళలు ఎదుగుతున్నారనడానికి ఇదే నిదర్శనం. ఎల్లారెడ్డిపేట కాలేజీ ప్రిన్సిపాల్‌ పద్మావతి, చందుర్తి కాలేజీ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విజయలక్ష్మి, గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నాజ్‌ సుల్తానా, దమ్మన్నపేట మోడల్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా శ్రీలత వ్యవహరిస్తున్నారు.

నాజ్‌ సుల్తానా

శ్రీలత

విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement