చేయూత అందేనా? | - | Sakshi
Sakshi News home page

చేయూత అందేనా?

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● వడబోత పూర్తయినా ఎదురుచూపులే.. ● కొత్త దరఖాస్తులు 9,649 ● అర్హులుగా తేలినవారు 8,448 మంది ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి

ఇప్పటికే అందిస్తున్న పింఛన్లు

● వడబోత పూర్తయినా ఎదురుచూపులే.. ● కొత్త దరఖాస్తులు 9,649 ● అర్హులుగా తేలినవారు 8,448 మంది

సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల చేయూత పింఛన్లు అందిస్తామని ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఆశగా దరఖాస్తు చేశారు. ముందుగా జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా.. మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. వినాయకచవితి, బతుకమ్మ, దసరా పండగలు వెళ్లిపోయినా ప్రభుత్వం ఇస్తామన్న సామాజిక పింఛన్ల జాడ లేదు. జిల్లా వ్యాప్తంగా 9,649 మంది వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తు చేయగా, ప్రాథమిక అంచనా ప్రకారం 8,448 మంది అర్హులు ఉన్నట్లు తేలింది.

ఏడు రకాల పింఛన్లకు అవకాశం

ప్రభుత్వం ఏడు రకాల పింఛన్లకు అవకాశం ఇస్తూ.. ఒంటరి మహిళలు, వితంతువులు, గీతకార్మికులు, నేతకార్మికులు, ఽఫైలేరియా బాధితులు, డయాలసిస్‌ రోగులు(కిడ్నీ ఫెయిల్యూర్‌), దివ్యాంగుల(తలసేమియా, సికిల్‌సెల్‌, హీమోఫీలియా బాధితులు) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. ముందుగా ఆగస్టు 30లోగా దరఖాస్తులు సమర్పించాలని గడువు విధించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ధ్రువీకరణపత్రాలు అందించేందుకు సమయం కావాలని అభ్యర్థనలు రావడంతో సెప్టెంబరు 15 వరకు గడువు పొడగించారు. జిల్లావ్యాప్తంగా 9,649 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా వితంతువులు 4,127 మంది దరఖాస్తు చేయగా.. ఒంటరి మహిళలు 513, దివ్యాంగులు 2,271, చేనేత 1,478 మంది, కల్లుగీత కార్మికులు 1,260 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. జిల్లాస్థాయిలో ఆరుగురు అధికారులను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ నియమించారు.

8,042 మంది పింఛన్లు రద్దు

జిల్లాలో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారి లైవ్‌ అథెంటికేషన్‌ పూర్తి చేయడంతో 2,836 మంది మరణించినట్లు తేలింది. 2,505 మంది బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ కానివారు ఉన్నారు. 1,441 మంది స్థానికంగా లేని వారు, ఆధార్‌ ధ్రువీకరణ సరిగా లేనివారు 1,260 మంది.. ఇలా జిల్లాలో మొత్తం 8,042 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. వీరికి సంబంధించిన పింఛన్లు నిలిపివేశారు. మరోవైపు కొత్త దరఖాస్తులనూ శాసీ్త్రయంగా విచారించారు. రద్దయిన పింఛన్ల స్థానంలో కొత్తవి మంజూరు చేసినా సర్కారుపై పెద్దగా ఆర్థికభారం పడదని భావిస్తున్నారు.

వృద్ధులు, బీడీ కార్మికుల నిరీక్షణ

జిల్లాలో అర్హులైన వృద్ధులు, బీడీకార్మికులు ఉన్నా చేయూత పింఛన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. పీఎఫ్‌ సౌకర్యం ఉండి.. బీడీలు చేసే కార్మికులు కొత్తగా పింఛన్లు కావాలని కోరుతున్నారు. మరో వైపు వృద్ధులు సైతం సామాజిక పింఛన్లకు ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం లేదు. దీపావళి పండుగ నాటికై నా తీపికబురు లభిస్తుందని భావిస్తున్నారు.

చేయూత పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాం. క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

– లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో

వృద్ధాప్య 29,276

దివ్యాంగులు 9,270

వితంతు 23,051

నేతకార్మికులు 3,291

గీతకార్మికులు 2,152

ఒంటరి మహిళలు 1,761

బీడీకార్మికులు 42,991

ఫైలేరియా బాధితులు 948

డయాలసిస్‌ 171

మొత్తం 1,12,911

ప్రతీ నెల చెల్లించే మొత్తం రూ.24,60,20,256

కొత్తగా దరఖాస్తులు 9,649

(సెప్టెంబరు 15 నాటికి)

అర్హులు 8,448 (అక్టోబరు 15 నాటికి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement