పోలీస్‌ అమరుల యాదిలో.. | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరుల యాదిలో..

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

పోలీస్‌ అమరుల యాదిలో..

సిరిసిల్ల: ప్రజాసంక్షేమమే పోలీసుల కర్తవ్యమని, ప్రజల రక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి మానేరువాగు తీరంలోని బతుకమ్మ ఘాట్‌ వరకు 2కే రన్‌ నిర్వహించారు. ఈ 2కే రన్‌ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, వెంకటేశ్‌, ఆర్‌ఐ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement