● సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్
వేములవాడ: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ అన్నారు. సురక్షిత్ బచ్‌పన్ అభయాన్‌లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ల పిల్లల కు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఏపీపీ బొడ్డు ప్రశాంత్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, జాయింట్ సెక్రెటరీ కనికరపు శ్రీనివాస్, అడ్వకేట్లు కుంట శ్రీనివాస్, శ్రీకాంత్, నాయిమ నాసారి, రేగుల రాజకుమార్, భీమ మహేష్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్/సిరిసిల్ల అర్బన్: జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించి, అర్హత గల మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ఈమేరకు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. జిల్లాలోని పలు మండలాల్లో వర్షాభావం, సాగునీటి కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో శాసీ్త్రయ సర్వే చేయించాలని కోరారు. నాయకులు లింగంపల్లి శంకర్, పొన్నాల తిరుపతిరెడ్డి, ఆసాని రామలింగారెడ్డి, దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్/సిరిసిల్లటౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు ముందుకురావాలని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ(ఐఆర్) పోలీస్ బెటాలియన్‌లో బుధవారం వాత్సల్య ఫౌండేషన్, మిత్రబ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు లింగంపెల్లి ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: మండలంలోని గాలిపెల్లి హైస్కూల్ పదో తరగతి విద్యార్థి మల్లుగారి నిఖిల్‌రెడ్డి జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పావని, వ్యాయామ ఉపాధ్యాయుడు సానబాబు తెలిపారు. ఈనెల 30 నుంచి నవంబర్ 1 వరకు కోల్‌కతలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు వివరించారు.
మెడికల్ కాలేజీలో 49 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
సిరిసిల్ల: జిల్లా మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 49 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జే.రాజేశ్వరీ బుధవారం ప్రకటనలో తెలిపారు. నర్సింగ్ ఆఫీసర్లు(స్టాప్‌నర్సు బ్లడ్ బ్యాంకు) 2, నర్సింగ్ ఆఫీసర్లు(స్టాప్‌నర్సు ఐసీయూ) 4, అనస్థీషియా టెక్నీషియన్లు 5, బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్లు 3, సిటీ, డెంటల్ టెక్నీషియన్ ఒక్కో పోస్టు, ఈసీజీ టెక్నీషియషన్ 2, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 5, కార్పెంటర్ 1, ఎలక్ట్రీషియన్ 5, టేలర్ 1, కటలోగుర్(సెంట్రల్ రికార్డు) 1, థియేటర్ అసిస్టెంట్ 1, గ్యాస్ ఆపరేటర్ 3, ల్యాబ్ అటెండర్ 2, మేల్/ఫీమేల్ నర్సింగ్ 1, బార్బర్ 3, అటెండెంట్ 4, వార్డు బాయ్ ఒక్క పోస్టు ఖాళీగా ఉందని వివరించారు. అర్హతలున్న అభ్యర్థులు ఈనెల 30 నుంచి నవంబరు 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


